అలాగైతే ఎస్సీ కార్పొరేషన్ మూసేయడం మేలు: హైకోర్టు
అమరావతి:
ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ నిధులను నవరత్నాలకు ఎలా మళ్లిస్తారని నిలదీసింది.
ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
స్వయం ఉపాధి కింద బడ్జెట్లో కేటాయించిన ₹7వేల కోట్లలో ఏమీ ఖర్చు చేయలేదా అని ప్రశ్నించింది.
ఎస్సీ కార్పొరేషన్ ఉద్దేశం నెరవేరనప్పుడు దాన్ని మూసేయడం మంచిదని వ్యాఖ్యానించింది.
బిల్లుల చెల్లింపు వివరాలతో అఫిడవిట్ వేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీని ఆదేశించింది.