
అసమర్థ కాంగ్రెస్ పాలనలో కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది
రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ ఉద్యమ మహ నాయకులు తోలి సిఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ పదేళ్లు పచ్చగా కళకళలాడిందని, అసమర్థ కాంగ్రెస్ పాలనలో కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని నాడు గోదావరినది నిండుకుండలగా జల కల సంతరించుకుంటే నేడు కాంగ్రెస్ పాలనలో గోదావరినదిలో నీళ్లు లేక వెలవెలబోతుందని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరినదిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఎంతో గోప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి గోదావరినదిని నిండుకుండలాగా మార్చరన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం హాయంలో తాము ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో గోదావరినదిపై తెప్పాల పోటీలు నిర్వహించామని చెప్పారు. మహశివరాత్రి పర్వదినం నాడు భక్తులు గోదావరినది స్నానం అచరించడం అనవాయుతిగా వస్తుందని కాని స్నానాలు చేసేందుకు సరైనా నీరు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఇది కాంగ్రెస్ పార్టీ అసమర్దత పాలనకు నిదర్శనం అన్నారు. అబద్ధాలతో అమలు కాని హామిలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు వెంకన్న, కోడి రామకృష్ణ ఆవునూరి వెంకటేష్ రామరాజు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
