
సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె వన్ ఇంక్లైన్ రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు కు ఇరు వైపుల చెత్త కుప్పలు ఉన్నాయని, వాటిని తొలగించె విధంగా ఆర్జీ వన్ యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ ఒక ప్రకటన లో అధికారులను కోరారు.
గత కొన్ని నెలలుగా ఇక్కడ డంప్ చేసిన చెత్త కుప్పలను తొలగించడం లేదని, అదేవిధంగా చికెన్ వ్యర్థాలు ఇట్టి చెత్త కుప్పల పై పోయడం వల్ల ఈ రోడ్డు మీదుగా వెళ్లే వాహాన దారులు, ప్రజలు దుర్వాసనతో తో ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సింగరేణి ఆర్జీ వన్ అధికారులు స్పందించి వన్ ఇంక్లైన్ రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు ప్రక్కన ఉన్న చెత్త కుప్పలను తొలగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఒక ప్రకటన లో కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
