TRINETHRAM NEWS

తేదీ : 17/02/2025. కుక్కునూరు మండలం : (త్రినేత్రం న్యూస్); విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం అంగన్వాడి లకు కనీస వేతనాలు అమలు మరియు సమ్మె డిమాండ్లను అమలు చేయాలని సిఐటియు కార్యదర్శి వై. సాయికిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కుక్కునూరు మండల ప్రాజెక్టు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సిడిపిఓ లక్ష్మి కుమారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు , మినీ వర్కర్లు, అనేక సేవలు అందిస్తున్నారు సెంటర్ల నిర్వహణ కు రకరకాల పెట్టుబడులు పెట్టి నిర్వహిస్తున్నప్పటికీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 వ సంవత్సరం నుండి వేతనాలు పెరగటం లేదు. వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం కొరకు 42 రోజులపాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించడం జరిగింది. ముగింపు సందర్భంగా 2024 వ సంవత్సరం జులై నెలలో వే తనాలు పెంచుతాము, ఇతర సమస్యల పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.

అయినా నేటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస వేతనం రూపాయలు 26,000/- ఇచ్చి గ్రాడ్యుటి అమలు చేయాలని , రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ సెంటర్లను పాపులేషన్ తో సంబంధం లేకుండా మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలి. వెంటనే జీవో అమలు చేయాలని , హెల్పర్ల ప్రమోషన్ కు నిర్దిష్టమైన గైడెన్స్ రూపొందించి అమలు చేయాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలని సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అని పదాన్ని తొలగించాలి.
పెండింగ్ లో ఉన్న సెంటర్ అద్దెలు టి ఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ కింద మార్పు చేయాలని, పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, నేను చార్జీలు పెంచాలి, ఉచితంగా గ్యాస్ సరపరాచేయాలి. అదేవిధంగా వేతనంతో కూడిన మెడికల్ సెలవు కనీసం మూడు నెలలు ఇవ్వాలని ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి. పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరూ అంగన్వాడి సెంటర్లో ఉండాలని , జీవో ఇవ్వాలి.

సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ ధర్మాలో అంగన్వాడీలు. అన్నపూర్ణ, రాధా, మంగ, రమణ, విమల, నాగమణి, మాధవి, తులసి, శ్రీలత, గౌరీ, వసంత, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CITU