TRINETHRAM NEWS

హోటల్ పరిశ్రమ నేరుగా వ్యవసాయదారులద్వారా కూరగాయలు ఇతర ఉత్పత్తులు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 11 : హోటల్ పరిశ్రమ వారు నేరుగా వ్యవసాయదారులద్వారా కూరగాయలు ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. తద్వారా ఇటు రైతులకు అటు హోటల్ యాజమాన్యాలకు ఎక్కువ లబ్ధి చేకూరడంతో పాటు కల్తీ లేని ఆహార పదార్థాలు లభిస్తాయని పేర్కొన్నారు. కెపిహెచ్బి కాలనీ ఆరో ఫేస్ లో నూతనంగా ఏర్పాటుచేసిన లెమన్ రిడ్జ్ హోటల్, రెస్టారెంట్ ను ఆయన సోమవారం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఎవరు ఇంట్లో వంట చేసే పరిస్థితి లేదని అందరూ హోటల్స్ పైనే ఆధారపడే పరిస్థితి నెలకొంది అన్నారు. రమేష్ మాట్లాడుతూ వినియోగదారుల మనసు చూర గొన్నపుడే ఏ వ్యాపారమైన విజయవంతమవుతుందని రమేష్ పేర్కొన్నారు. వినియోగదారుల అభిరుచి మేరకు తమ వ్యాపార నిర్వహణ ఉంటుందని హోటల్ నిర్వాహకుడు వెంకటనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, సుధాకర్ ,ప్రకాష్ , మద్దూరి రాము, అరుణ్, ఫణి కుమార్, శివ చౌదరి, అజాచ్, సంధ్యా ,వనజ, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vegetables and other products