45వ డివిజన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
మీ ఓటు పేరాబత్తులకు ఓటేయండి,గ్రాడ్యుయేట్లకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పిలుపు
రాజమహేంద్రవరం : మీ అమూల్యమైన ఓటును ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న విజ్ఞానవంతుడు పేరాబత్తుల రాజశేఖరానికి వేయాలని గ్రాడ్యుయేట్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) కోరారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని 45వ డివిజన్‌లో ఆయన రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ స్థానిక నాయకులతో కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సదరు డివిజన్‌లో గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరానికి ఓట్లు వేసి గెలుపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరం గెలుపునకు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న రాజశేఖర్‌ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. రాజమండ్రి అర్బన్‌లో సుమారు 17280 ఓట్లు ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన రోజుల్లో కంటే గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ నష్టపోయిందన్నారు.
గత పాలకులు చూపిన నష్టాల వలన అప్పు తీసుకొచ్చి అప్పు తీర్చే పరిస్థితి నేడు లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరేడు మాసాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నమన్నారు. ఎన్‌టిఆర్ భరోసా కింద ప్రతినెల పెన్షన్ లబ్ధిదారులకు ఒకటవ తేదీనే అందజేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ అయిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి టీచర్ల పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్నారు.
ఉచిత గ్యాస్ సిలిండర్లు, ల్యాండ్ ట్కెటిలింగ్ రద్దు, అన్నా క్యాంటీన్ ఉచిత భోజన పథకం లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ప్రజా సంక్షేమ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇప్పటికే గుంతలు లేని రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App