![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-13.02.56.jpeg)
ప్రభుత్వాసుపత్రిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలి
మార్చురి వద్ద వ్యాపారం చేస్తున్న ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి
గుండుబోగుల సత్తిబాబు మృతి పట్ల సమగ్ర విచారణ చేయాలి
టీడీపీ నగర కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్ డిమాండ్
ఆసుపత్రి ప్రత్యేకాధికారి భాస్కర్‌రెడ్డికి ఫిర్యాదు
Trinethram News : రాజమహేంద్రవరం : పూర్తియిలో అవినీతి, నిర్లక్ష్యంతో ఉన్న రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రిని పూర్తిస్థాయిలో ప్రకాళన చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి, 50వ డివిజన్ ఇన్‌ఛార్జ్ మరుకుర్తి రవి యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రత్యేకాధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్‌రెడ్డికి టీడీపీ నాయకులు అజ్జరపు రమేష్, కొత్తల కిషోర్ తదితరులతో కలిసి శనివారం ఫిర్యాదు చేశారు.
రాజమహేంద్రవరం నియోజవర్గంలోని ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో మంది పేదలకు వైద్య సేవలందిస్తోందని, వైద్యం నిమిత్తం చుట్టు పక్కల ఉన్న అనేక మారుమూల గ్రామాల నుంచి వైద్యం నిమిత్తం వస్తుంటారని, అయితే వైద్యుల నిర్లక్ష్యమో లేక మరే ఇతర కారణాలో తెలియదు కానీ వైద్యం నిమిత్తం ఇక్కడకు వచ్చే వారికి సక్రమమైన వైద్యం అందడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో సకాలంలో వైద్యం అందక సీతానగరం మండలం శ్రీరామనగరానికి చెందిన గుండుబోగుల సత్తిబాబు (42) అనే యువకుడు మృతి చెందాడని, అతని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం కావచ్చని ఆరోపించారు.
ఈ విషయంలో సమగ్ర విచారణ చేసి సత్తిబాబు నిండు ప్రాణం పోయేందుకు నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని కోవాలని ఫిర్యాదు ద్వారా ఆయన్ను కోరారు. అలాగే ఆసుపత్రి ఆవరణలోని మార్చురిలో నిత్యం పోర్టు మార్టం జరుగుతుంటాయని, ఇక్కడ పోస్టు మార్టం నిర్వహించే వైద్యుడి సహాయకుడి అవుట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి మృత దేహాలతో వ్యాపారం చేస్తూ వారి బంధువుల దగ్గర నుంచి అధిక మొత్తంలో ఆర్ధికంగా దోచుకుంటున్నాడని, ఈ విషయంలో కూడా సమగ్ర విచారణ చేసి ప్రసాద్‌పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వీటిపై స్పందించిన ప్రత్యేకాధికారి భాస్కర్ రెడ్డి పై విషయాలపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![government hospital](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-13.02.56-1024x580.jpeg)