ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగు నిర్మూలన కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చెయ్యాలి
రాజమహేంద్రవరం. జాతీయ అందత్వ నివారణ కార్యక్రమం క్రింద విద్యార్థులను ఉచిత కళ్ళజోళ్ల పంపిణీను కార్యక్రమాన్ని ప్రారంభిచాం
నులిపురుగుల నివారణ గోడ పత్రికను ఆవిష్కరించిన.. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి.
ఆరోగ్యవంతమైన పిల్లల జీవన విధానంలో భాగంగా నులిపురుగు నిర్మూలన కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేయ్యాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు.
గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో రాష్ట్రీయ బల స్వస్త్య కార్య క్రమంలో భాగంగా నులిపురుగుల నివారణ గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కిందకళ్లజోళ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం మాప్-అప్ డే నిర్వహిస్తూన్నట్లు చెప్పారు. దేశంలోని ప్రతి బిడ్డను నులిపురుగుల బారిన పడకుండా నివారణ చర్యలు ద్వారా నులి పురుగుల రహితంగా సమాజాన్ని తీర్చిదిద్దాలని, ఆ దిశలో మార్పుకు భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఫిబ్రవరి 10 వతేది 17 తేదీల్లో నులిపురుగు నివారణ మాత్రలు అందజేయడం జరుగుతుందన్నారు. పిల్లలకు చేరువయ్యే అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమాలలో ఇది ఒకటిఅని అన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల వారు మరియు ప్రజల సహకారంతో వందశాతం లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి 10.02.2025 న ఒకే మోతాదులో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని 10.2.2025 న ఒక మోతాదు మరియు 17.02.2025న ఒకే మోతాదు అందించడం ద్వారా మాప్ అప్ డేని నిర్వహించాలని తెలియ చేశారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కే వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ 1-19 సంవత్సరాల గల పిల్లల ద్వారా మాత్రలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని 1556 అంగన్‌వాడీ కేంద్రాలు, 1578 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, ఇందులో బడి మానేసిన పిల్లలతో సహా 1 నుండి 19 సంవత్సరాలలోపు 4,30,339 మంది విద్యార్థులు ఉన్నారని లక్ష్యాన్ని సాధించే దిశగా అందరికీ అల్బెండజోల్ అందిస్తామ్మన్నారు.
టాబ్లెట్ మింగే పిల్లలకు తీవ్ర అనారోగ్యం ఉన్నప్పుడు వారికి వేయరాదని, ఖాళీ కడుపుతో తీసుకో కకూడన్నారు.భోజనం చేసిన మందులు తీసుకోవలసి ఉంటుందన్నారు. మండల స్థాయి బృందంలో మెడికల్ ఆఫీసర్, మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఎమ్ డి ఓ మరియు ఎమ్ ఆర్ ఓ మరియు సి .ఆర్ .పి . సంబంధిత మండల అధికారులు కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు డివిజనల్ స్థాయి మానిటర్లను నియమించడం జరిగిందన్నారు.
అనంతరం జాతీయ అందత్వ నివారణ కార్యక్రమం క్రింద జిల్లాలో 2024 ఆగష్టు నుంచి డిసెంబర్ మధ్య 18 సంవత్సరాల వయస్సుగల విద్యార్థులను స్క్రీనింగ్ చేయడం ద్వారా 3500 మంది కంటి సమస్యలున్న వారిని గుర్తించి వీరికి ఉచిత కళ్ళజోళ్ల పంపిణీను కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిచారు.
ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ వో డా కే. వెంకటేశ్వర రావు, డి ఎల్ డి ఓ డా.ఎన్.వసుంధర, పిడి ఐ సి డి ఎస్ అధికారి కె.విజయ కుమారి, జిల్లా ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హరిచంద్ర ప్రసాద్, డాక్టర్ రాజీవ్ , డాక్టర్ అభిషేక్, ఆర్ ఐ ఓ ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం, డి ఈ ఓ వాసుదేవరావు, డి ఎస్ టి ఇ ఓ కె. ఎన్.జ్యోతి కంటి వెలుగు ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.లావణ్య, ఇతర ప్రోగ్రామ్ అధికారులుతదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App