TRINETHRAM NEWS

చిన్న,మధ్య తరహా పత్రికలను ప్రభుత్వం గుర్తించాలి TWJF

Telangana ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కమీషనర్ కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తిడిఎంఏసీ మెంబర్ తొలగింపు ఉత్తర్వులను రద్దు చేయాలిసానుకూలంగా స్పందించిన కమీషనర్ హైదరాబాద్, ఫిబ్రవరి 04:
రాష్ట్రంలో ఏళ్ళ తరబడి నిరంతరంగా నడుస్తున్న చిన్న, మధ్య తరహా పత్రికలను ప్రభుత్వం ఎంప్యానల్మెంట్ జాబితాలో చేర్చి గుర్తించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)
రాష్ట్ర నాయకులు కోరారు.

ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్, నేషనల్ కౌన్సిల్ పద్మనాభరావు,కుంచెం శ్రీనివాస్ తదితరులు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ ఎస్.హరీష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వాలు చిన్న, మధ్య తరహా పత్రికలకు ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని, ప్రభుత్వం నుంచి అడ్వర్టయిజ్మెంట్స్, సబ్సిడీలు లేక ఏళ్ళతరబడి నడుస్తున్న అనేక పత్రికలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

జర్నలిజం వృత్తిని నమ్ముకున్న అనేక మంది సీనియర్ పాత్రికేయులు చిన్న, మధ్య తరహా పత్రికలు నడుపుతున్నారని, అలాంటి వారికి ప్రభుత్వం గుర్తింపు లేక ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. సీనియారిటీ, రెగ్యులారిటీ ఉన్న పత్రికలను ఎంప్యానెల్మెంట్ జాబితాలో చేర్చకుండా కొన్నేళ్లుగా పెండింగ్ లో పెట్టి ఈ మధ్య కాలంలో వచ్చిన పత్రికలను ఎంప్యానల్ లో పెట్టి ప్రోత్సాహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలా చేయడం ప్రభుత్వానికి తగదని వారన్నారు. అర్హత ఉన్న అన్ని పత్రికలను ప్రభుత్వం గుర్తించాలని వారు కమీషనర్ ను కోరారు.

దీనిపై కమీషనర్ స్పందిస్తూ, అర్హత ఉన్న చిన్న,మధ్య తరహా పత్రికలను త్వరలో ఎంప్యానల్మెంట్ లో చేరుస్తామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో రెగ్యులారిటీ ఉన్న దినపత్రికల జాబితాను పరిశీలించి వాటిని ఎంపానల్ లో చేర్చిన తర్వాత రేట్ కార్డు జారీ చేస్తామని తెలిపారు. యూసుఫ్ తొలగించడం సరైంది కాదు రాజన్న-సిరిసిల్ల జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీడీఎంసీఏ నుంచి తమ సంఘం సభ్యుడైన యూసుఫ్ ను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఐఅండ్ పీఆర్ కమీషనర్ ను కోరారు.

ఈ మేరకు వారు మంగళవారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ తదితరులు కమీషనర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. యూసుఫ్ పై స్థానికులు కొందరు తప్పుడు కేసులు బనాయించారని, నిరాధారమైన ఆరోపణలతో కేసు నమోదు చేసి అతనిని డీఎంసీఏ నుంచి తొగింపజేశారని వారు ఆరోపించారు. అకారణంగా తొలగించిన యూసుఫ్ ను తిరిగి డీఎంసీఏ లోకి తీసుకోవాలని వారు కోరారు. యూసుఫ్ ను తొలగించిన విషయంపై కమీషనర్ హరీష్ సానుకూలంగా స్పందీస్తూ, ఈ సంఘటను సరిచేయడానికి చర్యలు తీసుకుంటానని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TWJF