TRINETHRAM NEWS

ప్రమాద ఘటన పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్

నగరి రోడ్డు ప్రమాదం ఘటన బాధాకరం

నగరి త్రినేత్రం న్యూస్ : నగరి -రామాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన పై ఆరా తీశారు. మృతులు కుటుంబాలకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు.

ఘటనపై వైద్యుల తో మాట్లాడి,క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం సీతారామాపురం కు చెందిన పార్థసారధి నాయుడు, రాజేంద్ర నాయుడు, తిరుపతి కి చెందిన మణిగండ, తమిళనాడుకు చెందిన చిన్న మలై మరో గుర్తుతెలియని వ్యక్తి ల మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Gali Bhanu Prakash