వైయస్సార్సీపి ఫీజు పోరు దీక్ష విజయవంతం చేయండి
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్, వైఎస్ఆర్సిపి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జిల్లా అధ్యక్షుడిగా కొత్త తరహాలో మండల కేంద్రంలో ముఖ్య నాయకులతో సమావేశాలు
బిక్కవోలు మండలం ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం జరిపిన వేణుగోపాలకృష్ణ
ఫీజు 4 దీక్ష పోస్టర్ విడుదల చేసిన వైఎస్సార్సీపి నాయకులు
ఈనెల 5వ తేదీన వైఎస్ఆర్సిపి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పీజీ ఫోర్ దీక్షను విజయవంతం చేయాలని మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్సిపి అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. బిక్కవోలు లో శనివారం మాజీ ఏఎంసీ చైర్మన్ జంగా వీర వెంకట సుబ్బారెడ్డి గారి గృహంలో బిక్కవోలు మండల ముఖ్య నాయకులతో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ లు ఆత్మీయ సమావేశం నిర్వహించి బిక్కవోలు మండలంలో వై ఎస్ ఆర్ సి పి నీ. బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ తాను జిల్లా అధ్యక్షుడు గా పార్టీని బలపర్చడానికి కొత్త తరహాలో మండలానికి ఒక గ్రామంలో మండలంలోని ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పరిచి వారి నుండి సూచనలు సలహాలు సేకరించి పార్టీ ప్రతిష్ట కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశాలు మొదలుపెట్టానని ఇందులో భాగంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని,రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతుందని, సూపర్ సిక్స్ హామీలు అమలు పరచడంలో కాలయాపన చేస్తుందని విద్యార్థులకు నాలుగు వార్షికాల ఫీజు బకాయిలు చెల్లించక విద్యార్థులు తమ తమ కాలేజీలలో అవస్థలు పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అవలంబించాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు పరచారని ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారని ఇటువంటి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఈనెల 5వ తేదీన రాజమహేంద్రవరంలో కలెక్టరేట్ వద్ద ఫీజు పోరు దీక్ష నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రం అందించి విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా నిలవాలని భావించామని, ఈ పీజుపోరు దీక్షను అందరు విజయవంతం చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో ఏఎంసి మాజీ చైర్మన్ లు సబ్బెళ్ళ కృష్ణారెడ్డి,జంగావీరవెంకట సుబ్బారెడ్డిలు బిక్కవోలు మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి (బుజ్జి), బిక్కవోలు ఎంపీపీ బుద్దాల కన్నారావు, బిక్కవోలు ఉపసర్పంచ్ జంగా మురళీకృష్ణ, రంగాపురం సర్పంచ్ గండికోట వీరభద్రరావు, కాపవరం సర్పంచ్ సత్యం ల్శెట్టి వెంకటరమణ, ఇల్లపల్లి ఎంపిటిసి పోలునాటి స్వర్ణలత పోతురాజు, మాజీ ఎంపీటీసీ కాపవరం నిడదవోలు శ్రీనివాసరావు, బలభద్రపురం గ్రామ కన్వీనర్ కొవ్వూరి వెంకట రామారెడ్డి, కాపవరం ఎంపీటీసీ మేడపాటి ఆనంద్ రెడ్డి, బలభద్రపురం ఎంపీటీసీ సబ్బెళ్ళ సుజాత వీర్రాఘవరెడ్డి, ఎస్ ఏ పి మాజీ డైరెక్టర్ గుబ్బల లాజర్ బాబు, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, ఊలపల్లి సొసైటీ ప్రెసిడెంట్ గండ్రాల విజయశేఖర్ రెడ్డి, పందలపాక గ్రామ కన్వీనర్ సత్తి హరిప్రసాద్ రెడ్డి, బొడ్డు ముత్యాలరావు, పందలపాక ఎంపీటీసీ మచ్చపాప, ఎంపీటీసీ కర్రి సతీష్, గండి వాసు, అరికరేవుల గ్రామ కన్వీనర్ తొండాపు గాంధీ, అరికరేవుల శ్రీనివాస రెడ్డి, తమ్మిరెడ్డి నాగ శ్రీనివాసరెడ్డి, ఎల్. వీరబాబు, కోరుకొండ నాగేశ్వరరావు, జంగా గంగాధర్ రెడ్డి, తాళ్ళ చంటి, తాళ్ళ నిరంజన్ రెడ్డి, గువ్వల సత్తిరెడ్డి, శేఖర్, జి.భీమన్న, చీకట్ల నాని, గొల్లపిల్లి రాంబాబు మున్నూరు శంకర్, తొండాపు కాశి, గుమ్మడి వెంకటేశ్వర్లు, గండికోట అప్పారావు, పోట్రు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App