బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది.
మోడీ చేతుల్లో కీలు బొమ్మగా మారిన నిర్మలా సీతారామన్.బండి రమేష్…
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 1 : ఎప్పటి మాదిరే తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ విమర్శించారు. మోడీ దేశానికి ప్రధానమంత్రి లా కాకుండా ఇంకా ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే భావిస్తున్నారని రమేష్ ధ్వజమెత్తారు. ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ప్రతిసారి మొండి చేయి చూపటం మోడీకి అలవాటుగా మారిందన్నారు. మోడీ చేతుల్లో కీలు బొమ్మగా మారిన నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కనీస స్థాయిలో కూడా నిధులు విదల్చలేదని విమర్శించారు.
మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల పాలు చేసి పోయిందని అలాంటి పరిస్థితుల్లో మోడీ రాష్ట్రానికి పెద్దన్నలా ఉండి నిధులు కేటాయించి ఆదుకోవాల్సింది పోయి పెద్ద మొండి చేయి చూపించారని రమేష్ తీవ్రంగా విమర్శించారు. భవిష్యత్తులోనైనా మోడీ ఇలాంటి పక్షపాత ధోరణిని విడనాడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుందని ఆశలన్నీ అడియాసల య్యాయన్నారు. ఏ ఒక్క శాఖకు కనీస స్థాయిలో నిధులు కేటాయింపు జరగలేదని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App