రిటైర్డ్ జీవశాస్త్ర మేడం కు ఘన సన్మానం
25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న కోల వనజకు హర్షద్వనాల అభినందనలు.. వనజను అభినందించిన పెద్దపెల్లి విద్యాధికారి మాధవి .. ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థుల ఘన స్వాగతo
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని ఫిబ్రవరి 01
ఉపాధ్యాయ వృత్తిలో 25 సంవత్సరాలు నిర్విరామ సర్వీసును అందించి చివరి మజిలీలో గోదావరిఖని ప్రభుత్వ బాలికల పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేసిన కోల వనజ 31 జనవరి నాడు పదవి విరమణ పొందారు శనివారం పాఠశాల ఆవరణలో ఘనంగా వనజ ను పదవీ విరమణ ఘన సన్మాన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జింక మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోల వనజ తన సర్వీసును ఏ ఏ పాఠశాలలో చేశారు అక్కడ తన వృత్తి ధర్మాన్ని ఎలా నెరవేర్చారు సవిరంగా వివరించారు జ్యోతి ప్రజ్వలన అనంతరం జింక మల్లేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజంలో ఎంతో పవిత్రమైందని వేలాది మంది విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కోల వనజకు దక్కిందని కొనియాడారు చివరిగా మా బాలికల పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ పదవి విరమణ పొందడం ఒక క oదుకు మాకు సంతోషంగా ఉన్నప్పటికీ ఒక మంచి ఉత్తమ ఉపాధ్యాయురాలు జీవశాస్త్రాన్ని బోధించడానికి లేకపోవడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు పెద్దపెల్లి డీఈవో మాధవి జిల్లాలో కలెక్టర్ తో సమావేశం ఉన్నందున ఉదయం నేరుగా పాఠశాలకు వచ్చి కోల వనజను ఘనంగా శాలువుతో సన్మానించి ఆమె చేసిన సేవలను కొనియాడారని మల్లేశం తెలిపారు అనంతరం వేదికపై ఆసీనులైన ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు అలాగే రిటైర్డ్ అయిన ప్రధానోపాధ్యాయులు వనజ చేసిన సేవలను సాన్నిహిత్యాన్ని కొనియాడారు
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీలు చేసిన పలు రకాల నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి పాఠశాలలో చదివే విద్యార్థులే ఈ కార్యక్రమ సమన్వయకర్తలుగా కొనసాగుతూ వచ్చిన అతిథులను ఆహ్వానిస్తూ వారికి వేదిక వద్దకు బ్యాండ్ పార్టీ ద్వారా ఆహ్వానిస్తూ చేసిన సేవలు వచ్చిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా అభినందించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా గోదావరిఖని ఉర్దూ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి భవాని చందనాపూర్ ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి ,విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు మేరీ, సీనియర్ ఉపాధ్యాయురాలు రమ, శాస్త్రి, మనోహర్ అరుంధతి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మణ్ అలాగే పలు పట్టణ ప్రముఖులు హాజరుకాగా అత్యధిక మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App