TRINETHRAM NEWS

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరణ

ప్రజలు ఇచ్చిన వినతులను, సమస్యలను సకాలంలో పరిష్కరించి న్యాయం చేస్తా- రుడా ఛైర్మెన్ – బొడ్డు

Trinethram News : రాజమండ్రి : కోరుకొండ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఉదయం 10 గంటల నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించడం జరిగింది..మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు స్థానిక సమస్యలను బొడ్డు వెంకటరమణ చౌదరి గారి దృష్టికి తీసుకువచ్చారు.

గ్రామాల్లోని పరిస్థితులను బొడ్డు వెంకటరమణ చౌదరి గారి దృష్టిలో పెట్టడంతో కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను సంబందిత శాఖల అధికారులకు బదలాయించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

కోరుకొండ ఆటో యూనియన్ వారు పలు సమస్యలను ఆయనకు తెలియపరచగా దాని పై సానుకూలంగా స్పందించి భరోసా కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

tdp