జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 31 at 18.05.19

TRINETHRAM NEWS

మారథాన్ రన్ తో ప్రారంభమైన అరకు చలి ఉత్సవలు. జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ దినేష్ కుమార్.

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 1: కూటమి ప్రభుత్వ పాలనలో మొదటి సారిగా నిర్వహిస్తున్న గిరిజన సాంప్రదాయ ఉత్సవం. ఐదు సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న ఈ అరకు చలి ఉత్సవాలు, మొదటి రోజు అయినా శుక్రవారం 5 KM మారథాన్ రన్ తో అల్లూరిజిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.అరకు రైల్వే స్టేషన్ నుంచి డిగ్రీ కళాశాల మైదానం వరకు మారథాన్ నిర్వహించారు.

దీనిలో భాగంగా గంజాయికి వ్యతిరేకంగా పోస్టర్లు రిలీజ్ చేశారు. యువత మత్తును వదిలి మంచి మార్గంలో నడవాలని, సూచిస్తూ గంజాయి కి వ్యతిరేకంగా నిర్వహిస్తూ. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానం వరకు మరథాన్ రన్ కొనసాగించారు. దీనిలో భాగంగా జేసీ అభిషేక్, ఐటీడీఏ పీవో అభిషేక్, సబ్ కలెక్టర్ శౌర్యమాన్, ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ దొన్నుదొర ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page