జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 31 at 16.04.10

TRINETHRAM NEWS

పాఠశాలకు ప్రింటర్ బహుకరణ
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా కంభం. కంభం మండలంలోని కందులాపురం ప్రాథమికోన్నత పాఠశాల 1990-91 బ్యాచ్ 7వ తరగతి పూర్వ విద్యార్థులు పాఠశాలకు 20వేల రూపాయలు విలువచేసే ప్రింటర్ ను బహుకరించారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర విశిష్టమైనదని, తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు.

పాఠశాలకు ఉపయుక్తమైన ప్రింటర్ బహుకరించిన పూర్వ విద్యార్థులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఎం. రాజు పూర్వ విద్యార్థులను అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page