WhatsApp Image 2025 01 30 at 19.29.55
46 మైనర్ ఇరిగేషన్ చెరువులలో – 3 లక్షల 23 వేల చేప పిల్లల విడుదల
Trinethram News : రాజానగరం జిల్లా
దీని వలన 32 మత్స్యకారుల సహకార సంఘాలు లోగల 5300 కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లాలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకం ద్వార 3,23,820 చేప పిల్లలను, జిల్లాలోని గల ఐదు నియోజకవర్గాలలో 46 మైనర్ ఇరిగేషన్ చెరువులలో మత్స్యకారుల సొసైటీలకు అందుబాటులో ఉండే విధంగా చేప పిల్లలను విడుదల చేయడమైనదని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు.
గురువారం రాజానగరం మండలం నందరాడ గ్రామ పంచాయతీ అడుసుమిల్లి వెంకయ్య చెరువు నందు చేప పిల్లల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మత్స్యకార సహకార సంఘాలకు సరఫరా చేయుట జరుగుతుందన్నారు. దీని వలన జిల్లాలో గల మైనర్ ఇరిగేషన్ చెరువులలోని చేపల ఉత్పత్తితో పాటు ఉత్పాదకత పెరుగుతుందన్నారు. నీటి వనరులు పూర్తిగా వినియోగించుకోనుటకు వీలుపడుతుందన్నారు. ఈ చేప పిల్లల విదుదల వలన 32 మత్స్యకారుల సహకార సంఘాలు లోగల 5300 కుటుంబాలకు జీవనోపాధి మెరుగుపడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
చేప పిల్లలను బయట కొనుగోలు చేస్తే ఆర్థికపరంగా సొసైటీలకు కొంత భారం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే సీడ్స్ ను మత్స్యకార సొసైటీలకు అందిస్తుందన్నారు. మూడు, నాలుగు నెలలలో చేప పిల్లల పెరిగి వారు పట్టుకోవడానికి అందుబాటులో వస్తాయని తద్వారా వారికి ఆదాయం సమాకూరుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపలు అధికంగా లభించుట వలన ప్రజలకు మంచి ప్రోటీన్ గల తాజా ఆహారం అందుబాటు ధరలలో లభిస్తుందన్నారు. దీని వలన ప్రోటీన్ సెక్యూరిటీ సమకూరి, ప్రజలకు పోషక భద్రత చేకూరుతుందన్నారు. ఇప్పటివరకు మత్స్యశాఖ, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న చెరువును మాత్రమే వినియోగిస్తున్నామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఆక్వా జోన్లో ఉన్న చేపల చెరువులకు సబ్సిడీ అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే చెరువులు తవ్వి నాన్ ఆక్వా జోన్లో ఉన్నవారికి కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు పరిమిషన్ ఇచ్చి వారికి కూడా సబ్సిడీని విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి వి కృష్ణా రావు, జిల్లా మత్స్య సహకార సంఘం ప్రెసిడెంట్ బలసాడి రంగారావు, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
