జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 18.32.00

TRINETHRAM NEWS

ఉపాధి హామీ పనుల్లో విషాదం

సిద్దిపేట జిల్లా: జనవరి 30 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోజు మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంలో భాగంగా, తల్లి కూతురు,కూలి పనికి వెళ్లారు. మట్టిని తవ్వు తున్న క్రమంలో పైన ఉన్న పెద్ద పెద్ద బండ రాళ్లు తల్లి కూతురుపై పడిపోయాయి, ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి
ఈ సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండ లం గోవర్ధనగిరి గ్రామంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది, మృతులు తల్లి సరోజ, కూతురు మమత గా గుర్తించారు గాయపడి న వారిని చికిత్స అందించేం దుకు సమీపం లోని ఆసుపత్రికి తరలిం చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page