WhatsApp Image 2025 01 29 at 19.23.09
రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయండి.
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాలని కోరుతూ ఈనెల 31న ఉదయం 10 గంటలకు పట్టణంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నదని ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక సిపిఐ కార్యాలయం నందు సమావేశం జరిగింది ఈ సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని పట్టణంలోని ప్రజాసంఘాలు స్వచ్ఛంద సంస్థలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు పశ్చిమ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయటంలో పాలక పార్టీల నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రాజెక్టు ప్రారంభించి 28 సంవత్సరాలు పూర్తికావస్తున్న నేటికీ వెలుగొండను పూర్తి చేయడంలో పాలకుల చిత్తశుద్ధి అర్థమవుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సోమయ్య, సిపిఐ ఏరియా కార్యదర్శి అందే నాసరయ్య సిపిఎం పట్టణ కార్యదర్శి డీకేఎం రఫీ, సిపిఎం మండల కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
