WhatsApp Image 2025 01 28 at 20.37.54
ద్విచక్ర వాహనాలు నిలుపడం వలన పాదాచారులు మరియు వాహనాలకు తీవ్ర ఇబ్బంది.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఎదురుగా మీసేవ, జిరాక్స్ సెంటర్లు ఆధార్ సెంటర్ ఉండటం వలన రోజుకు కొంతమంది ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుంటారు పని నిమిత్తం ఆధార్ సెంటర్,, మీసేవ, జిరాక్స్ సెంటర్ల ముందు రోడ్డు వెంట ద్విచక్ర వాహనాలు నిలిపి ఉండడం వలన పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్-శ్రీశైలం 765 జాతీయ రహదారి వెంబడి ఒకవైపు రోడ్డు మొత్తం ద్విచక్ర వాహనాలు నిలిపి ఉండడం వలన రహదారి వెంట వెళ్లే వాహనాలకు, మరియు పాదాచారులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.
ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనాలు నిలుపుదలపై పోలీస్ శాఖ (డిండి) వారు చొరవ తీసుకొని అదుపు చేస్తే బాగుంటుందని, డిండి పట్టణ ప్రజల పలువురి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
