జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 28 at 20.11.32

TRINETHRAM NEWS

ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

రాజమహేంద్రవరం:

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి ఒకటవ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో శాఖా పరంగా అధికారులు వారికి కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు.

మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా పర్యటన లో భాగంగా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో గృహ ప్రవేశం కార్యక్రమం, ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆయా శాఖల అధికారులు సమన్వయంతో శాఖా పరంగా చేపట్టవలసిన పనులు మార్గదర్శకాలు మేరకు బాధ్యతా యుతంగా వ్యవహారించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తిస్థాయి ఇన్చార్జిగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు , హెలిపాడ్ ఏర్పాటు అంశానికి సంబంధించి ఆర్ అండ్ బి అధికారులు , ప్రోటోకాల్ వ్యవహారాలు ఆర్డీవో పూర్తిస్థాయి బాధ్యత తీసుకోవాలన్నారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అంశాన్ని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.

కొవ్వూరు నియోజకవర్గం, కొవ్వూరు డివిజన్, దొమ్మేరు గ్రామపంచాయతీకి సంబంధించిన పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్ ను జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సిద్ధం చేయాలని ఆదేశించారు. శానిటేషన్, త్రాగునీరు, మున్సిపల్ అధికారులకు, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం జిల్లా సమాచార పౌర సంబంధాలు అధికారికి, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ తో ఇతర శాఖల అధికారులకు కేటాయించిన పనులను వ్యక్తిగత బాధ్యతతో తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి సభ ఏర్పాట్ల కు సంబంధించి పూర్తి వివరాలు సి ఎమ్ వో ఖరారు చేసిన అనంతరం వెల్లడించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం
జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనకు సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, డిఆర్ఓ టి. సీతారామమూర్తి, ఆర్డీవోలు రాణి సుస్మిత, కృష్ణ నాయక్, హౌసింగ్ ఇంచార్జి పి డి కే. భాస్కర్ రావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page