![WhatsApp Image 2025 01 28 at 19.29.14](https://trinethramnews.in/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-28-at-19.29.14.jpeg)
తేదీ : 28/01/2025.
స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు
గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంగళగిరి లో మానవ వనరులు , ఐటీ , ఎలక్ట్రానిక్స్, ఆర్జిజీ ఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరి టౌన్, రూరల్ మండలంలో కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 80 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, సర్టిఫికెట్స్ పంపిణీ చేయడం జరిగింది. 68వ బ్యాచ్ లో 60 రోజులపాటు శిక్షణ పొందిన మహిళలకు టిడిపి కార్యాలయం ఎమ్మెస్సాస్ భవనంలో నియోజకవర్గ తెలుగు మహిళలు కుట్టు మిషన్లు అందజేశారు. అందుకున్న లబ్ధిదారులు నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది.
ఈ సందర్భంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర .భూలక్ష్మి, మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ స్త్రీ శక్తి ద్వారా పేద మహిళలకు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. తమ కుటుంబం జీవనోపాధిని పెంచుకోవాలన్నారు. సాధికారతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అని అనడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిడిపి పాలకమండలి సభ్యులు తమ్మిశెట్టి .జానకి దేవి . రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి ఆకుల .జయసత్య, మంగళగిరి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు. ఊట్ల దుర్గా మల్లేశ్వరి, మండల తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి అప్పుల. శాంతి, పట్టణ కార్యదర్శి వాసా. పద్మ, నియోజవర్గ అధికార ప్రతినిధి య లమంచిలి. పద్మజ, పట్టణ కార్యదర్శి ఉడత. లావణ్య, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![](https://trinethramnews.in/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-28-at-19.29.14.jpeg)