జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 28 at 17.55.49

TRINETHRAM NEWS

పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.

నల్గొండ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ లోపు తమ టీం సభ్యుల పేర్ల జాబితాను సంబంధిత మండల పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాల్సిందిగా డిండి ఎస్సై రాజు తెలిపారు.

మండల స్థాయిలో గెలుపొందిన అభ్యర్థులకు డివిజన్ స్థాయిలో, డివిజన్ స్థాయిలో డివిజన్ స్థాయిలో గెలుపొందిన అభ్యర్థులకు జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహిస్తారన్నారు.

మండల స్థాయి పోటీలో గెలుపొందిన ప్రధమ జట్టుకు రూపాయలు ఐదువేలు, ద్వితీయ బహుమతి 2500, తృతీయ బహుమతి 1500, రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

మండల పరిధిలో తమ టీం సభ్యుల పేర్లను నమోదు చేసుకోవడానికి, చారవాని 8712675544లో సంప్రదించాలని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page