TRINETHRAM NEWS

ముంబై ఉగ్రదాడుల్లో సూత్రధారి ‘తహావూర్ రానా’ భారత్ కు

Trinethram News : MUmbai : పాకిస్థాన్‌ మూలాలున్న కెనడా జాతీయుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. అతన్ని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించింది. దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాణా వేస్తున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్న తహవూర్ రాణాను వాంటెండ్ టెర్రరిస్టుగా ప్రకటించి, తమకు అప్పగించాలంటూ భారత్ కొంతకాలంగా అమెరికాను కోరుతోంది. భారత్‌కు అప్పగిప్పంత రాదని రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్ కోర్టులో ఆయన అప్పీల్‌ను తోసిపుచ్చడంతో ఆయన చివరి ప్రయత్నంగా గత నవంబర్ 13న సుప్రీంకోర్టుకు వెళ్లారు.

ఆయన పిటిషన్‌ను కొట్టేయాలని యూస్ ప్రభుత్వం సైతం వాదన వినిపించింది. భారత్‌కు అప్పగించకుండా ఉండేందుకు రాణా అర్హుడు కాదని యూఎస్ సొలిసిటర్ జనర్ ఎలిజిబెత్ బి.ప్రొలోగర్ వాదించారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు జనవరి 21న రాణా పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం ఆయన లాస్ఏంజెల్స్‌లోని మెట్రోపాటిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారు.

26/11ముంబై దాడుల కీలక కుట్రదారు అయిన పాకిస్థాన్-అమెరిక్ ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో రాణాకు సంబంధాలు ఉన్నాయి. ముంబై ఉగ్రదాడుల్లో ఆరుగురు అమెరికన్లు, 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ నుంచి కొలబా సుముద్ర తీరానికి చేరి ముంబైలోకి అడుగుపెట్టిన 10 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు ముంబైలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 60 గంటలసేపు మారణహోమం సాగించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App