TRINETHRAM NEWS

ఓటు పౌరుల ప్రాథమిక హక్కు

త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం.

ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు మార్కాపురం పట్టణంలో నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. మొదటిగా నిర్వహించిన బైక్ ర్యాలీలో స్వయంగా బైక్ నడిపిన శాసనసభ్యులు వారు పాల్గొని అందరిని ఉత్సాహపరిచారు.
అనంతరం నాయుడు బజార్లో జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు అబ్బురపరిచాయి. అనంతరం మహిళలు మ్యాజికల్ చైర్స్ ఆటలో పాల్గొని అందరిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా రంగవల్లుల, కరాటే, మ్యాజికల్ చైర్స్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ అధికారులు ఎంతో కష్టపడి ప్రజల్లో ఓటు హక్కు పై అవగాహన తీసుకురావడానికి నిర్వహించిన బైక్ ర్యాలీ గాని, రంగవల్లుల పోటీ కానీ, కరాటే విన్యాసాలు గాని, మ్యాజికల్ చైర్స్ ఆటగాని నిర్వహించారని వారిని అభినందించారు.
ఓటు పౌరుల ప్రాథమిక హక్కు అని దానిని సక్రమంగా ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పుడిప్పుడే మార్కాపురం ప్రాంతం అభివృద్ధి చెందుతుందని త్వరలోనే మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధిస్తామని, వెలుగొండ పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ గారు మార్కాపురం ఎమ్మార్వో గారు మార్కాపురం సిఐ గారు, మార్కాపురం మున్సిపల్ కమిషనర్ గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App