TRINETHRAM NEWS

దివ్యాంగుల ఉపాధి మరియు పునరావాస పథకం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దివ్యాంగులు ఆర్థిక స్వాలంబన పొంది ఇతరుల వలె సాధారణ జీవనం గడపడానికి వ్యవసాయం మరియు అనుబంధ పరిశ్రమలు సేవా వ్యాపారాలను స్థాపించుకొని జీవనోపాధి పొందాలని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా దివ్యాంగులు ఉపాధి మరియు పునరావాస పథకం ప్రవేశపెట్టబడింది.

ఈ పథకం కింద బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా 50,000- సబ్సిడీ తో 2024- 25 ఆర్థికసంవత్సరమునకు ఈ పథకం కింద మన జిల్లాకు 24 యూనిట్లు ద్వారా 12 లక్షలు సబ్సిడీ మంజూరు చేయడం జరిగినది కాబట్టి తేదీ 23-01-2025 నుండి02-02-2025 వరకు అర్హులైన దివ్యాంగులు www.tg.obmms.cgg.gov.in ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిని B.కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ పథకం కింద అర్హులు కనీసం దివ్యాంగత్వం 40% శాతం పైన ఉండాలి2.21 నుండి 55 ఈ సంవత్సరాల వయసు లోబడి ఉండాలి.ఆదాయపరిమితి.1.5 లక్షలకు- గ్రామీణ ప్రాంతాలలో,పట్టణ ప్రాంతాలలో. 2 లక్షలు ఉన్నవారు అర్హులు.గమనిక: గతంలో సబ్సిడీ మరియు లోను మంజూరు నిమిత్తం దరఖాస్తు చేసుకొని ఇట్టి పత్రికా ప్రకటన వెలువడిన తేదీ వరకు సబ్సిడీ మంజూరు కాలేని పెండింగ్ దరఖాస్తుదారులు తిరిగి పైన తెలిపిన వెబ్ సైట్ నందు కొత్తగా మరల దరఖాస్తు చేసుకోగలరు.
తదుపరి జిల్లా స్థాయి సెలెక్ట్ కమిటీ అర్హులైన వికలాంగులను సెలెక్ట్ చేసిమంజూరు చెయ్యటం జరుగుతుంది.
ఇతర వివరాలకై జిల్లా సంక్షేమ అధికారిని, మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ S9 రెండవ అంతస్తు కలెక్టర్ కార్యాలయం వికారాబాద్ గారిని అన్ని కార్యాలయ పని వెలళలొ సంప్రదించగలరు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App