TRINETHRAM NEWS

తేదీ : 22/01/2025.
కళను నెరవేర్చిన శాసనసభ్యులు.
జీలుగుమిల్లి మండలం : (త్రినేత్రం న్యూస్); విలేఖరి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం, మండల కేంద్రంలో ఉన్న పాతపండు వారి గూడెం, తబిసి వారి గూడెం ప్రజల కళను డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు తీర్చడం జరిగింది. గత రెండు దశాబ్దాల కాలంగా ఎన్ని ప్రభుత్వాలు మారిన రోడ్డు కావాలి అనే కళ కలగానే ఉండిపోయింది. ఇబ్బందులు చూసి ఎమ్మెల్యే కలెక్టర్ గారితో మాట్లాడి 60 లక్షల మెటల్ రోడ్డుకి అప్రూవల్ తీసుకొచ్చిన ఘనత వారిది. రోడ్డు శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా దర్భ గూడెం పంచాయతీలో సుమారు మూడు కోట్లు రూపాయలను రోడ్ల నిర్మాణానికి అప్రూవల్ తీసుకురావడం శుభ పరిణామం అని ప్రజలు అనడం జరిగింది. ఎన్డీయే నాయకులు, కార్యకర్తలు, ప్రజలు , హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐ.టీ.డీ. ఏ ఈ ఇ ఎ ఇ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి రాము, ఎంపిటిసి మరియు సర్పంచులు ఎన్డీయే నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App