కళ్యాణ లక్ష్మి ఫైల్ పెండింగ్ పై విచారణ.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్
లబ్ధిదారులతో కళ్యాణ లక్ష్మి ఫైల్ పెండింగ్ విచారణ చేపడుతున్న తహసిల్దార్ ఆంజనేయులు. మండల పరిధిలోని పడమటి తండాకు చెందిన రాత్లావత్ అఖిల కు సంబంధించిన కల్యాణ లక్ష్మి ఫైల్ ను ఉన్నతాధికారులకు పంపించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఐ శ్యాం నాయక్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలిసిందే, ఏడాది కాలం నుండి కల్యాణ లక్ష్మి ఫైల్ ను పెండింగ్ ఉంచడానికి గల కారణాలను తహసిల్దార్ ఆంజనేయులు పడమటి తండాలో అఖిల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
కళ్యాణ లక్ష్మి ఆయనకు సంబంధించిన రిపోర్టు తయారుచేసి స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సంతకం అనంతరం దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డికి త్వరలో అందజేస్తామని తహసిల్దార్ వారికి చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App