నెత్తంకండ్రిగ ఎస్టీ కాలనీ చిరకాల కోరిక తీర్చిన గాలి భాను ప్రకాష్
Trinethram News : నగరి మున్సిపాలిటీ నెత్తం కండ్రిగ ఎస్టీ కాలనీ వాసులు ఏండ్ల నుండి త్రాగు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు.తమ కాలనీ జనావాసాల మధ్య బోర్ వేయించి త్రాగు నీరు అందించాలని తమ వద్దకు వచ్చిన ప్రజా ప్రతినిధులను మొరపెట్టుకున్నారు.ఎవ్వరు సమస్యను పరిష్కరించలేదు. గత ఎన్నికల్లో గాలి భాను ప్రకాష్ వద్ద సమస్యను ప్రస్తావించగా బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నెత్తంకండ్రిగలో తాగునీటి సమస్యకు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పరిష్కారం చూపారు.
₹4.50 లక్షలతో కాలనీ లో బోర్ వేయించి మోటార్ బిగించి 3 ఇంచుల నీరు అందించటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App