TRINETHRAM NEWS

బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రెస్ మీట్

Trinethram News : కరీంనగర్ జిల్లా

నిన్న కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా ముగ్గురు మంత్రులు వచ్చారని మమ్మల్ని ఆహ్వానిస్తే మేం వెళ్లాం.

ఎజెండా కూడా క్లియర్ గా ఉంది.

ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యల్ని తీసుకెళ్లాలనుకున్నాం.

మా డిమాండ్స్ సభ ముందు పెట్టాం.

ఇందిరమ్మ ఇళ్లు వచ్చినట్టు ఫోటోలు దిగినవారంతా భ్రమలో ఉన్నారు, క్లారిటీ ఇవ్వాలని కోరాం.

కానీ, సమాధానం రాలేదు.

కౌశిక్ రెడ్డి , సంజయ్ కుమార్ వ్యవహారంలో కౌశిక్ ను పోలీసులు గుంజుకెళ్లడం విచారకరం.

నేనేనాడూ అలాంటి ఘట్టాలను చూడలేదు.

ముగ్గురు మంత్రులు అనుమతిస్తెనే గుంజుకువెళ్లారా..?

అనుమతిస్తే మీరు సభ నడపడంలో విఫలమైనట్టే.

మీ ఆదేశాలు లేకుండా పోలీసులు స్టేజ్ ఎక్కారుటే మీరు క్షమాపణ చెప్పాలి.

సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ ఇరిటేట్ అయ్యాడు.

కోపతాపాలు సర్వసాధారణం.. కంట్రోల్ చేయాలి.

ఒక ఎమ్మెల్యేను గుంజుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఎంతమందిపై మీరు కేసులు పెడతారు..?

అదేమైనా బలప్రదర్శన వేదికనా..?

పోలీస్ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్.

కౌశిక్, సంజయ్ మధ్య ఏం జరిగిందనేది డిఫరెంట్, అది వ్యక్తిగతం.

కానీ, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారనేదే మా క్వొశ్చన్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App