తేదీ: 12/01/2025.
నిలదీద్దాం ఎన్డీయే ప్రభుత్వాన్ని.
ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే ఐదు నెలలు కావస్తున్నా , ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? వాటిని తక్షణమే అమలు చేయాలి. గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసినట్టు ఈ ప్రభుత్వం చేయొద్దు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ? ఏజెన్సీ ప్రాంతాల మధ్యాహ్న భోజన పథకాలు వెంటనే చెల్లించాలి. సమాన పని , వేతనం సుప్రీంకోర్టు తీర్పు అసంఘటిత
కార్మికులకు నెలకి వేతనం 35 వేల రూపాయలు ఇవ్వాలి. వచ్చేనెల ఫిబ్రవరి ఢిల్లీలో జరిగే ఏఐసి సిటీయు 11వ జాతీయ సభలను ప్రజలందరూ విజయవంతం చేయాలని, అదేవిధంగా నిన్నటి జగన్, నేటి చంద్రబాబు నిరుపేదలకు గృహకల్పన అన్నది ఎండిపోయిన చెరువుల మారిందని రమణక్కపేట గ్రామంలో కనీసం స్మశాన భూమి అక్రమణ తొలగించలేకపోయారు. ఆయుర్వేద వైద్యశాలను పునరుద్ధరించాలి, పశువుల వైద్య భవనాన్ని నిర్మించాలి.
అని సి.పి.ఐ (యం. యల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, అఖిల భారత కిసాన్ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ ఎన్డీయే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. 21 మంది సభ్యులతో కార్యదర్శిగా వేముల బక్కయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లోకల్ కమిటీ కాన్ఫరెన్స్ విజయవంతం అయింది. ఈ కార్యక్రమంలో పల్లి పాము భవాని రాణి, మేరమ్మ రామకృష్ణ దారాబేలు . శాలిని, షేక్. గౌసియా, యడ్లపల్లి .రెడ్డయ్య శివ , బత్తిన రమణక్క , ఆంజనేయులు , బొమ్మ బోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App