WhatsApp Image 2025 01 06 at 19.44.24
రామగుండం కమిషనరేట్ పరిధిలో చైనా మంజా నిషేదం
నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయించిన, వినియోగించిన చట్టపరమైన చర్యలు
ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో చైనా మాంజ పై నిషేధం. ఎవరైనా చైనా మంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి హెచ్చరించారు. సంక్రాంతి సందర్భంగా చైనా మాంజ ఎక్కువగా విక్రయించే దుకాణాల పై అధికారులు తనిఖీ లు నిర్వహించడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఒక ప్రకటన లో తెలిపారు. నైలాన్, సింథటిక్ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలతో పర్యవరణానికి విపత్తుగా కావడంతో జాతీయ హరిత ట్రిబ్యూనల్ ఆదేశాలను మేరకు రామగుండము పోలీస్ కమీషనరేట్ లో చైనా మాంజ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. చైనా మాంజను ఉపయోగించి గాలి పటాలు ఎగురవేసే క్రమంలో ఎన్నో పక్షులు, సాధారణ ప్రజలు కూడా ప్రమాదానికి గురవుతారు. అదేక్రమంలో గాలిపటాలు ఎగురవేసే వ్యక్తులు కూడ ప్రమాదానికి గురైన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చైనా మంజా నిషేదించాం అని సీపీ తెలిపారు. చైనా మాంజాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా కూడా వుంటుంది అని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయాలు జరగకుండా తగు చర్యలు తీసుకొవడం జరుగుతొందని ప్రధానంగా ప్రజలు సైతం చైనా మాంజా వినియోగించకుండా ఎవరికి హాని కలగని సాధారణ దారంతో గాలిపటాలను ఎగురవేసుకోవాలని, అలాగే ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్న, వినియోగిస్తున్న డయల్ 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలనీ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
