TRINETHRAM NEWS

గిరిజన ప్రాంతంలో పట్టా మ్యుటేషన్ చేసుకోవడానికి కొన్నీ సడలింపులుండలి.

అల్లూరి జిల్లా అరకు లోయ/జనవరి 03.త్రినేత్రం న్యూస్ :

అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకు వేలి మండలం సుంకర మెట్ట పంచాయతీ కిన్నాం గుడా గ్రామంలో నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులో ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు గెమ్మెల చిన్న బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సు ల్లో పటాన్యుకేషన్ చేసుకోవడానికి డెత్ సర్టిఫికెట్ ప్రామాణికం చేయడంతో మూడు తరాలు నుండి పట్టా మ్యూటేషన్ చేసుకోలేని రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మ్యూటేషన్ చేసుకోవడానికి తహసీల్దార్ కార్యాలయనికి వెళితే తండ్రి డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ అడుగు తుండడంతో గిరిజన ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు దగ్గర తమ తల్లి దండ్రుల మరణించినప్పుడు డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలి అనే అవగాహనా లేకపోవడం తో పొంద లేక పోయారు.

ప్రస్తుతం లీగలైజ్ సర్టిఫికెట్ పొందాలి అంటే ఆఫీస్ ల చుట్టూ తిరిగే ఓపిక లేక చాలా మంది రైతులు పట్టా మ్యూటేషన్ చేసుకోలేక ఉండి పోయారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సుల్లో డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ లేకుండా గ్రామంలో పంచనామ నిర్వహించి దాని ప్రాతిపదికన పట్టా మ్యూటేషన్ చేయాలి అప్పుడే రెవెన్యూ సదస్సుకు విలువ ఉంటుంది. లేకపోతే ప్రచార ఆర్బటాలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప రైతులకు జరిగేది ఏమి లేదు అన్నారు. ఈ కార్యక్రమం లో అనంద్రరావు, సత్యారావు,గురుమూర్తి, తదితరులు పాలోన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App