TRINETHRAM NEWS

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి.

అతి త్వరలో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు..

పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు.

ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి మండలంలోని చందపల్లి, హనుమంతుని పేట (రాంపల్లి) శివారులలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో కల్పించే మౌళిక వసతుల పనులను శనివారం రోజున మున్సిపల్ అధికారులతో మరియు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..

గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా డబుల్ బెడ్ రూమ్ లో నిర్మాణాలు వదిలేశారని గుర్తు చేశారు. ఇప్పటికే రూ.4 కోట్లు కేటాయించి డ్రైనేజీలు, రోడ్లు, నీటి సంపులు, ఇతరత్రా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇప్పటికే ఇట్టి పనులు ఒక కొలిక్కి వచ్చాయని, త్వరలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ పనుల విషయంలో ఎలాంటి ప్రయత్నం లోపం గాని లేదని, పనులు నిరంతరం కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మౌలిక వసతులను పూర్తిగా గాలికి వదిలివేసిందని చెప్పారు.

లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అలాగే రూ.5 లక్షల చొప్పున చెల్లించే ఇందిరమ్మ ఇండ్ల కేటాయించే కోసం రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. సర్వే ఇప్పటికే పూర్తి కావోస్తోందని చెప్పారు. నిరుపేదలకు మొదటి దశలో ఇండ్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. సంవత్సరానికి నియోజకవర్గానికి 3,500 ల చొప్పున ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తుందని వివరించారు. దశలవారీగా అర్హులైన అందరికీ ఇండ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే విజయరమణ రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఎ.ఈ, విద్యుత్ అధికారులు , ఏఎంసీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, పట్టణ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు మరియు డబుల్ బెడ్ ఇండ్ల లబ్ధిదారులు మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App