కిడ్నీలకు, మూత్రానికి మధ్య సంబంధం ఏమిటి?
ఈ సమస్యను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు కిడ్నీ నిపుణులు (నెఫ్రాలజిస్ట్) డాక్టర్ సిద్ధార్థ్ జైన్‌తో బీబీసీ మాట్లాడింది.
కిడ్నీలలో మూత్రం ఉత్పత్తి అవుతుంది. శరీరంలోని ఫ్లూయిడ్స్‌లో ఉన్న వ్యర్థాలను కిడ్నీలు వేరు చేస్తాయి. తర్వాత శరీరానికి హాని కలిగించే జీవ పదార్థాలు మూత్రం ద్వారా బయటికెళ్లిపోతాయి.
సరళంగా చెప్పాలంటే, కిడ్నీలు మన శరీరంలో ఫిల్టర్‌లా పనిచేస్తాయి. రక్తంలోని వ్యర్థాలను వేరు చేసి మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి.