TRINETHRAM NEWS

RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు

Trinethram News : Andhra Pradesh : APSRTC ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు.

దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు.

గతంలో ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఈ అలవెన్సులు ఉండగా, వైసీపీ హయాంలో ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎత్తివేశారు.

దాన్ని ఇప్పుడు తిరిగి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

దీని వల్ల ఉద్యోగులకు నెలకు రూ.5వేల నుంచి రూ.6వేలు అదనంగా అందనున్నాయి…