ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు
Trinethram News : ఏపీలో కూటమి ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు తీపి కబురు అందించనుంది. వారికి 100శాతం రాయితీతో త్రిచక్ర వాహనాలు (రెట్రోఫిటెడ్ మోటారు వాహనాలు) అందించాలని నిర్ణయించింది. 2024-25 ఏడాదికి ప్రతీ నియోజక వర్గానికి 10 మంది చొప్పున 1,750 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు అందించనున్నారు ఒక్కో వాహనం ఖరీదు రూ.లక్ష వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం వాహనాల పంపిణీకి రూ.17.50కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App