TRINETHRAM NEWS

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో పాడేరు శాసనసభ్యులు – విశ్వేశ్వరరాజు.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( జి. మాడుగుల మండలం ) జిల్లాఇంచార్జ్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి, ముఖ్య అతిథిగా పాల్గొన్న పాడేరు శాసన సభ్యులు, మరియు అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు.

_అల్లూరిజిల్లా, జి.మాడుగుల మండలం కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన “అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం” వేడుకల్లో ముఖ్య అతిథిగా పాడేరు శాసనసభ్యులు, మత్స్యరాస విశ్వేశ్వర రాజు పాల్గొన్నారు. దివ్యంగులు చిన్నారులకు ఆశీర్వదించారు. అనంతరం చిన్నారులకు, శాసన సభ్యులు చేతులు మీదుగా పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసన సభ్యులు మాట్లాడుతూ దివ్యాంగులు వికలత్వ భావనతో ఉండరాదని ఆత్మ ధైర్యంతో, పట్టుదల, ప్రతిభతో రాణించాలని అన్నారు. ధివ్యంగులు తమ ప్రతిభతో వివిధ రంగాల్లో రాణించి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని అన్నారు. చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

_ఈ కార్యక్రమంలో జి.మాడుగుల మండల ఎంఇఓ, మండల ఎంపీడీవో వివిధ శాఖల అధికారులు, స్థానిక సర్పంచ్ కిముడు రాంబాబు, సర్పంచులు ఫోరం అధ్యక్షులు సురబంగి రామకృష్ణ , సొలభం సర్పంచ్ ఐశారం హనుమంతరావు, సీనియర్ నాయకులు మసాడి గంగరాజు, మసాడి భాలన్న,కొండపల్లి సత్యనారాయణ, సీనియర్ నాయకులు నాయకులు, సిర్మ పండన్న,లంకెల కళ్యాణం, మత్యకొండబాబు , కోరభు కొండబాబు,రమణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App