కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చే ప్రకటన చేయించాలి, ఉల్లి మొగిలి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్న నేటికీ వేతనాలు పెరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి నేటికీ సంవత్సరం గడుస్తుంది ఈ తరుణంలో రేపు ముఖ్యమంత్రి పెద్దపల్లి జిల్లాకు వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి ద్వారా వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ 15 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి నేనిచ్చినటువంటి వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు అందుకు సిఐటియు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రేపు ముఖ్యమంత్రి ప్రకటించే విధంగా చేస్తే బాగుంటుందని మనవి చేశారు
ఈ కార్యక్రమంలో (సిఐటియు) సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం .రాష్ట్ర కమిటీ సభ్యులు ఉల్లి మొగిలి ,అర్జీ టు అధ్యక్షులు ,ఏ భూమయ్య డివిజన్ ఉపాధ్యక్షులు ఏ రామన్న ,కే లక్ష్మణ్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App