TRINETHRAM NEWS

డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్టణం త్రినేత్రం న్యూస్.
శ్రీపాచి పెంట చిన్నస్వామి ఏపీకాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆధ్వర్యంలో.*

భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు..
భారతదేశ మొట్ట.మొదటి రాష్ట్రపతి భారతరత్న. బిరుదాంకితుడు.డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్. జన్మదిన వేడుకలు,

అనగా 3.12.2024.న అరకు వేలి నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో. ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచి పెంట శాంతకుమారి ఆదేశాల మేరకు భరతమాత ముద్దుబిడ్డ బాబు.భారతరత్న*
భారత రాజ్యాంగ కమిటీ అధ్యక్షులు.. భారత దేశ మొట్ట మొదటి రాష్ట్రపతి
బాబూ రాజేంద్ర ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి 140 వ జయంతి.సందర్భంగా మహనీయునికి ఘనంగా నివాళులర్పించిన. అరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచి పెంట చిన్నస్వామి మాట్లాడుతూ న్యాయవాది. పండితుడు. పాత్రికేయుడు.
భారతరత్న బిరుదాంకితుడు.డా. రాజేంద్ర ప్రసాద్ (1884 డిసెంబర్ 3 – 1963 ఫిబ్రవరి 28) 1950 నుండి 1962 వరకు రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహించారు. ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా ‘బాబూ’ అని పిలిచేవారు. భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. 1948 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి అధ్యక్షత వహించాడు. 1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన తరువాత అతడు రాగ్యాంగ పరిషత్తు ద్వారా మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు. 1951 సార్వత్రిక ఎన్నికల తరువాత మొదటి భారత పార్లమెంటు ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఒక రాష్ట్రపతిగా పక్షపాత ధోరణి లేకుండా, ఉన్నత పదవులలో ఉన్నవారు స్వాతంత్రంగా వ్యవహరించేందుకుగాను కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుండి వైదొలగి కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఈ పదవి అలంకారప్రాయ మైనదైనప్పటికీ అతడు భారతదేశంలో విద్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు గాను అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ కి.వివిధ సందర్భాలలో సలహాలనిచ్చేవాడు. 1957లో రెండవసారి రాష్ట్రపతిగా ఎన్నికై, రెండు సార్లు భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన. ఏకైక వ్యక్తిగా డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ చరిత్రలో నిలిచాడు…
*ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కో.ఆర్డినేటర్ తెల్ల గంజి సోమేశ్వరరావు మండల అధ్యక్షులు పాంగి గంగాధర్ ప్రధాన కార్యదర్శి శెట్టి భగత్ రాం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App