TRINETHRAM NEWS

న్యూ గంజ్ లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్

శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ను పర్యవేక్షించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ వికారాబాద్ మున్సిపల్ లో పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 25వ వార్డు, చైర్ పర్సన్ సొంత వార్డులోని న్యూ గంజ్ హనుమాన్ మందిర్ పక్కన నిర్వహించిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చైర్ పర్సన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ… మున్సిపల్ పరిధిలో ఎక్కడ చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, కమిషనర్ జాకీర్ అహ్మద్, నాయకులు దీపు, సందీప్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఏసు, జవాన్ శీను, మున్సిపల్ సిబ్బంది రాజు, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App