“స్థానిక సంస్థల ఎన్నికలను అందరూ సిద్ధం అవ్వండి”
Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణం
స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధం అవ్వాలని జనసేన నాయకులకు, వీరమహిళకు,జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా!! వంపూరు గంగులయ్య పిలుపునిచ్చారు, వివరాల్లోకి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం, గంగులయ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 6నెలలు అయ్యి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతూ, ప్రశంసలు అందుకుంటున్న తరుణంలో, కూటమిలో భాగస్వామ్యం లో ఉన్న సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలని జనసేన నాయకులకు, వీరమహిళలకు దిశానిర్దేశం చేశారు.. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రజల దృష్టికి తీసుకెళ్లి,కూటమి నాయకత్వం బలపర్చేలా, గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని, అది సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎంపీపీ, వల్లనే అది సాధ్యం అవుతుందని, ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో త్రికరణ శుద్ధిగా పని చెయ్యాలనీ సూచించారు… గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ మార్పుకి శ్రీకారం చుట్టాలని, తెలిపారు… నాయకులుగా తీర్చిదిద్దేందుకు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక, సిద్దంచేసి గ్రామ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు… ప్రభుత్వం చేపడుతునటువంటి సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను విసృతంగా ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలి.. అభివృద్ది ఫలాలు ప్రజలకు అందుతుందో లేదా అనేది పర్యవేక్షణ చెయ్యాలి..అదే విధంగా త్వరలో జరగబోయే నీటి సంఘాల ఎన్నికలకు కూటమి అభ్యర్థులే గెలవాలి.. మరియు భవిష్యత్తు లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటినుండే ముందస్తు ప్రణాళికలతో కూటమి నాయకుల మధ్య సమన్వయం ఏర్పర్చుకుంటూ ప్రజల విశ్వాసం పొందుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు… అనంతరం, జనసేన నాయకులు, వీరమహిళలు గంగులయ్య కి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సన్మానించారు… ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి కిట్లంగి.పద్మ, అధికార ప్రతినిధి బొనుకుల.దివ్యలత, పాడేరు మండల అధ్యక్షులు నందోలి.మురళీ కృష్ణ ఐటీ టీమ్ కో ఆర్డినేటర్ సీ.హెచ్.అనిల్ కుమార్, సీనియర్ నాయకులు పాంగి.శివాజీ,మండల ఉపాధ్యక్షులు ఏస్. భూపాల్, పాడేరు టౌన్ ప్రెసిడెంట్ మజ్జి నగేష్,కార్యనిర్వహణ సభ్యులు వంపూరు. సురేష్, మండల నాయకులు సుర్ల.సుమన్,రమేష్ నాయుడు ముదిలి. సుబ్బారావు, దేవేంద్ర ప్రసాద్, తల్లే. త్రిమూర్తులు, మాదేల. నాగేశ్వర్రావు,అప్పలరాజు, బట్టి.అంగదర్,కొర్ర రవికుమార్,రాములమ్మ, శివ తదితరులు పాల్గొన్నారు_
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App