WhatsApp Image 2024 11 30 at 16.04.18
శ్రీ చైతన్య హై స్కూల్, ఎన్.టి.పి.సి
పి.టి.ఎస్ విద్యార్థుల ట్రాఫిక్ అవగాహన ర్యాలీ
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఎన్టిపిసి టౌన్షిప్ లోని,
శ్రీ చైతన్య హై స్కూల్, విద్యార్థులు ఎఫ్ సి ఐ రోడ్డు చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ నియమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించవలసిందిగా మరియు ట్రాఫిక్ సిగ్నల్ రూల్స్ పాటిస్తూ వాహనాలను సురక్షితంగా నడపవలసిందిగా సూచించారు. ర్యాలీలో విద్యార్థులు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించని వారికి పుష్పగుచ్చాలు అందిస్తూ ట్రాఫిక్ నియమాల గురించి తెలియజేయడం జరిగింది.
విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నమ్రత, ఏవో నరేంద్ర కుమార్, డీన్ అనిల్ కుమార్, ఇన్చార్జి శైలజ, పి.ఈ.టి శృతి విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
