TRINETHRAM NEWS

ఫుడ్ పాయిజన్‌కు కారణం ఇదే..

మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

ఇటీవల తెలంగాణలోని పలు గిరిజన హాస్టళ్లు, మిడ్ డే మిల్స్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా, ఈ ఘటనలపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫుడ్ పాయిజన్ వెనక కుట్ర ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. కుట్ర వెనక ఎవరున్నా వదలేది లేదని హెచ్చరించారు.

కేటీఆర్‌కు సవాల్..

ఈ క్రమంలోనే ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ నాయకులేనని అన్నారు. దిలావార్ పూర్ వస్తే తప్పెవరిదో తేల్చుకుందాం అంటూ మంత్రి సీతక్క కేటీఆర్‌కు సవాల్ విసిరారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తమ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కుమారుడు తలసాని సాయి ఉన్నాడని తెలిపారు.

కంపెనీ రాసిస్తా..

కాగా, కాంగ్రెస్ నాయకులపై మాజీ మంత్రి తలసాని మండిపడ్డారు. తమపై కాంగ్రెస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ కంపెనీతో తమకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ఆరోపణలు నిరూపిస్తే కంపెనీ రాసిస్తానని ఛాలెంజ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App