విజయ్‌పాల్‌కు రిమాండ్ .. కస్టడీకి ఇవ్వాలని కోరిన పోలీసులు
Trinethram News : గుంటూరు : సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టు ముందుంచిన పోలీసులు..
విజయ్‌పాల్‌ను రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. వాస్తవాలు రాబట్టేందుకు ఇంటరాగేషన్ అవసరమని పేర్కొన్నారు. రఘురామకు చిత్రహింసల కేసులో విజయ్‌పాల్ పాత్ర కీలకమని కోర్టు దృష్టికి తెచ్చారు. చిత్రహింసల వెనుక సూత్రధారులను కనుగొనాల్సి ఉందని పోలీసులు తెలిపారు. రిమాండ్ రిపోర్టు పరిశీలించిన న్యాయమూర్తి విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App