WhatsApp Image 2023 12 31 at 1.25.54 PM
Actor Shivaji : మెగా ఫ్యామిలీపై శివాజీ కామెంట్స్..ఎవరో ఒకరు సీఎం అయి ఉండేవాళ్లు
Actor Shivaji : అమరావతి – హాస్య నటుడు, తెలుగుదేశం పార్టీ నేత శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి ఎవరో ఒకరు సీఎం కావాల్సి ఉండాల్సింది . కానీ ఎక్కడో తప్ప జరిగిందన్నారు.
ఇకనైనా ఆ కుటుంబం చేసిన తప్పులను సరిదిద్దుకొని రాజ్యాధికారం దక్కించు కుంటారేమో లేదో చూడాలన్నారు. ప్రస్తుతం శివాజీ(Shivaji) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఒక రకంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా మెగా కుటుంబానికి మరింత బలాన్ని ఇచ్చేలా ఉన్నాయి.
గత కొంత కాలం నుంచీ ఆయన టీడీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్ గా ఉన్నారు. శివాజీని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ వచ్చాయి కొన్ని న్యూస్ ఛానల్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీని, ఆ పార్టీ బాస్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేస్తున్నారు.
ప్రత్యేకించి ఆయన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ ను పదే పదే ముందుకు తెస్తున్నారు. రాష్ట్రంలో త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. 175 సీట్లలో టీడీపీ, జనసేన కూటమి గెలుపొందేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని జోష్యం చెప్పారు శివాజీ.
ఈ మధ్యనే ఆయన స్టార్ మా రియాల్టీ షో బిగ్ బాస్ లో పాల్గొన్నారు.
