వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను విజయవంతం చేయాలని
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన యేడాది పూర్తయిన సందర్భంగా జిల్లాలో ప్రజాపాలన కళా యాత్రను తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే నవంబర్ 19 నుండి డిసెంబర్ 07 వరకు ప్రజాపాలన కళా యాత్ర చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించడం జరిగిందని, దీనికి సంబంధించి సన్నాహక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా యంత్రాంగం,జిల్లాపౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న సాంస్కృతిక సారథి కళాకారులచే జిల్లాలోనిపెద్దగ్రామపంచాయితీలలో ఈ నెల 19వ తేదీ నుండి డిసెంబర్ 07 వరకు గ్రామాల్లో తిరుగుతూ ఆరు గ్యారంటీల పై అవగాహన కల్పిస్తూ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 19వ తేదీ నుండి ప్రారంభమయ్యేవిజయోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.కొడంగల్ లో రెండు రోజులు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన కళాయాత్ర బృందం ప్రోఫెసర్ అలేఖ్య పుంజల, అంతడుపుల నాగరాజు రాష్ట్రమంతా పర్యటిస్తారని ఆయన తెలిపారు. ఈ బృందాలు కొడంగల్ లోని రాఘవేంద్ర గార్డెన్ నందు ఈ నెల 18న సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రోఫెసర్ అలేఖ్య పుంజల బృందంచే ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. అదేవిధంగా డిసెంబర్ 7న అంతడుపుల నాగరాజు బృందంచే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు . జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విజయోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా విచేస్తారని తెలిపారు.అదేవిధంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డిలతో పాటు శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App