ఆసుపత్రి రిన్నోవేషన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

TRINETHRAM NEWS

ఆసుపత్రి రిన్నోవేషన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*రామగుండం జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

నవంబర్ -16:- గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం జనరల్ ఆస్పత్రిలో చేపట్టిన రెనోవోయేషన్పూ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.

శనివారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష రామగుండం జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామగుండం వైద్య కళాశాల పరిధిలోని ఆసుపత్రిలో రోగులతో ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తించే తీరు తదితర అంశాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.

ఆసుపత్రిలోని లేబర్ రూమ్, ఎం.ఐ.సి.యూ, నూతనంగా ఆసుపత్రి ప్రాంగణంలో వేస్తున్న రోడ్డు నిర్మాణ పనులను, నూతన నర్సింగ్ కాలేజ్ కోసం ప్రతిపాదించిన భవనాలను కలెక్టర్ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ హెచ్.ఓ.డి డాక్టర్ అరుణ, ఆర్ఎంఓ అప్పారావు,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top