TRINETHRAM NEWS

కుల గణన పై మోడీ వాక్యాలు ఉపసంహారించుకోవాలి.
బీసీ హక్కుల సాధన సమితి నాయకులు.

కుల గణన చేస్తే అనైక్యత వస్తుందని రాంచి ఎన్నికల ప్రచారలో ప్రధాని మోడీకి మరోసారి బీసీ లపై ఉన్న విద్వేషం కనిపిస్తోందని వెంటనే అలాంటి వాక్యాలను వెంటనే ఉపసంహారించుకోవాలని బీసీ హక్కుల సాధన సమితి నాయకులు నేడు షాపూర్ నగర్ కార్యాలయంలో పత్రిక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశంలో మోడీ వచ్చాక దేశ జనాభాలో 8 శాతం లేని అగ్రవర్ణాలకు పేదలు అనే పేరుతో 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన మోడీ నేడు కులగనన జరిగితే 80 శాతంగా ఉన్న బిసి లు “తమ జనాభా ఎంతో ప్రభుత్వంలో అంత వాటా ” అడిగితే అగ్రవర్ణాల వారి రాజకీయ,ఆర్థిక,సమాజిక స్థితిగతులు మారి బీసీలు ఎదుగుతారనే భయంతో ఒక కుట్రను మరోసారి ప్రజల మధ్య తీసుకొచ్చారని కావున బీసీలు వారి అసలు స్వరూపని గుర్తించి “మనమేంత మన వాటా అంత” అనే విదంగా పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు.కుల గణాన జరిగితే బీసీ లు రాజకీయ వాటా అడుగుతారని,ఉద్యోగాలలొ వాటా అడుగుతారని,ప్రమోషన్ లో వాటా అడుగుతారని చివరగా రాజ్యాధికారమే చెప్పట్టే అవకాశం ఉందని అందుకే బీసీలు ఎదగకుండా అగ్రవర్ణాలే ఎదిగే విదంగా చూస్తూ బీసీలను వారి జనాభా ఎంతో కూడా తెలియకుండా చూసేందుకే కుల గణాన ను వ్యతిరేకిస్తున్నారని రానున్న రోజుల్లో బీసీ లు కూడా వారి వాటా కోసం సాధించడానికి రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని అన్నారు.
ఈ సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి నాయకులు స్వామి,సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్,బీసీ నాయకులు మల్లేష్,శ్రీనివాస్, నర్సింహ,అశోక్,ప్రసాద్ లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App