Minister Nara Lokesh : విట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో సందడి చేసిన మంత్రి నారా లోకేష్

TRINETHRAM NEWS

విట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో సందడి చేసిన మంత్రి నారా లోకేష్

విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలను ఆసక్తిగా పరిశీలించిన మంత్రి

అంతర్జాతీయ యూనివర్సిటీల స్టాల్స్ సందర్శన

వీఐటీ ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ లాంఛనంగా ప్రారంభం

Trinethram News : అమరావతి : ప్రజా రాజధాని అమరావతి ఐనవోలులోని ప్రఖ్యాత విద్యాసంస్థ వీఐటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆద్యంతం సందడి చేశారు. ముందుగా వర్సిటీ చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు యూనివర్సిటీ నిర్వాహకులు, సిబ్బంది, విద్యార్థులు రెడ్ కార్పెట్ వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎడ్యుకేషన్ పెయిర్ ను రిబ్బన్ కట్ చేసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో మొదటి అంతర్జాతీయ ఉన్నత విద్య ప్రదర్శనను పురస్కరించుకుని యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కను నాటారు.

విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలను ఆసక్తిగా పరిశీలించిన మంత్రి

అంతర్జాతీయ ఉన్నత విద్య ప్రదర్శనలో వివిధ దేశాల ప్రతినిధులు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను మంత్రి ఆసక్తిగా తిలకించారు. తమ దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు గల అవకాశాలు, కోర్సుల వివరాలు, అడ్మిషన్లు, ఉపకారవేతనాలు, సౌకర్యాలు వివరిస్తూ అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా,కెనడాకు సంబంధించిన డెలిగేట్స్ ఈ స్టాల్స్ ను ఏర్పాటుచేశారు. స్టాల్స్ మొత్తం కలియతిరిగిన మంత్రి నారా లోకేష్ ఆయా దేశాల ప్రతినిధులతో సంభాషించారు. ఆయా దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అందిస్తున్న కోర్సులు, సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విట్ యూనివర్సిటీ విద్యార్థులు వినూత్నంగా రూపొందించిన వివిధ ఆవిష్కరణలను మంత్రి నారా లోకేష్ వీక్షించారు. వ్యవసాయ పనులకు తక్కువ ఖర్చులో లభ్యమయ్యే, వరదలను గుర్తించగల అత్యాధునిక డ్రోన్ ను ప్రదర్శించగా మంత్రి ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ రహిత వాహనం, రోబోటిక్ హ్యాండ్ రోవర్, స్మార్ట్ డాగ్ కోలార్, నెక్ట్స్ జనరేషన్ పీహెచ్ సెన్సార్స్ కలిగిన శక్తి 2.0, మూడు సెకన్లలో 180 కి.మీ స్పీడ్ అందుకోగల హైస్పీడ్ డ్రోన్, హ్యుమనాయిడ్ రోబోట్ ను మంత్రి పరిశీలించారు. ఆయా ఆవిష్కరణల గురించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ సృజనతో అద్భుత ఆవిష్కరణలను రూపొందించిన విద్యార్థులను అభినందించారు. వారితో కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top